వైకుంఠపురంలో అదే హైలైట్


త్రివిక్రమ్ సినిమా అనగానే సంచులకొంది పంచులు ఉంటాయని ఆశించేవారు. ఐతే, ఆయన పంచ్ డైలాగ్ లకి పులిస్టాప్ పెట్టేశారు. ఎందుకంటే ? ప్రతోడు పంచులేస్తున్నాడని. అదేనండీ.. ప్రతి సినిమాలోనూ పంచ్ డైలాగ్స్ వినిపిస్తున్నాయని త్రివిక్రమ్ మానేశాడు. సందర్భానుసారంగా వచ్చే సంభాషణలకే ఆయన పెద్దపీఠ వేస్తున్నారు. ఐతే, త్రివిక్రమ్ సినిమాలో టైమింగ్ కామెడీ హైలైట్ కానుందట. 

అల.. వైకుంఠపురంలో సినిమాలో టైమింగ్ కామెడీ అద్భుతంగా ఉండనుందని చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా ఆఫీస్ ఎపిసోడ్ కామెడీ అదిరిపోతుందట. ఆఫీస్ లో పూజా హెగ్డేను పడెయ్యడానికి బన్నీ చేసే కామెడీ, ఆ వేషాలు నవ్వులు పూయిస్తాయట. బన్నీతో పాటుగా రామకృష్ణ తనదైన శైలిలో నవ్విస్తారని, మొత్తంగా.. ఫామిలీ ఎంటర్టైనర్ ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా చూసి హాయిగా నవ్వుకోవచ్చని వార్తలు బయటికి లీకవుతున్నాయి. ఆ లీకులు ఎంత మేరకు కరెక్ట్ అనేది తెలియాలంటే సంక్రాంతి పండగ వరకు ఆగాల్సిందే. 

ఇక ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ బన్నీ అభిమానులని కన్ఫూజన్ లోకి నెట్టింసింది. సారజవరగమన పాటలో బన్నీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించారు. కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగిగా కనిపించాడు. ఐతే, ఫస్ట్ లుక్ లో బన్నీ పల్లెటూరి కుర్రాడిలో కనిపించారు. ఈ రెండింటికి సింక్ అవ్వడం లేదన్నది అభిమానుల గందగోళానికి కారమని తెలుస్తోంది. బహుశా.. బన్నీకి ఉద్యోగం లేని టైంలోని ఫస్ట్ లుక్, ఉద్యోగం వచ్చాక సీన్స్ పాటలో కనిపించేవి కావోచ్చేమో.. !