షాక్ : కోర్టుకు సల్మాన్ ఖాన్ పెళ్లిఫోటో


బాలీవుడ్ కండలవీరుడు పెళ్లి ఫోటో కోర్టుకు చేరింది. దాన్ని చూసిన జడ్జీ సైతం షాక్ అయ్యారు. సల్మాన్ కి పెళ్లెప్పుడు అయిందని ఆశ్చర్యపోవడం జడ్జి వంతైంది. ఇంతకీ మేటర్ ఏంటంటే ? బిలాస్‌ పూర్ జిల్లాకు చెందిన పండోపారాకాలరీ గ్రామానికి చెందిన బసంత్‌ లాల్‌ కు కొంతకాలం క్రితమే రాణీ అనే యువతితో పెళ్లైంది. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత బసంత్ లాల్ చనిపోయాడు. దీంతో..  రాణిని అత్తారింటి నుంచి పంపించేశారు. ఆమెకి రావాల్సిన ఉద్యోగాన్ని కూడా రాణివ్వలేదు. దాంతో రాణి కోరుకెళ్లింది.

విచారణలో భాగంగా జడ్జీ పెళ్లి ఫోటో అడిగారని.. బసంత్ లాల్ కోర్టుకు ఓ ఫోటోను పంపాడు.  ఆ ఫోటోను చూసి జడ్జి షాక్ అయ్యాడు.  అందులో యువతి పక్కన పెళ్ళికొడుకు దుస్తుల్లో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. ఆ ఫోటో మార్ఫింగ్ చేశారని తెలుసుకొని రాణికి అనుకూలంగా జడ్జి తీర్పునిచ్చారు. ఈ విషయం పక్కనపెడితే.. సల్మాన్ ఖాన్ పెళ్లెప్పుడు చేసుకొంటాడు ? అంటే.. ఆ ఒక్కడు అడక్కు అనేది సల్మాన్ నుంచి వచ్చే సమాధానం. ఆయనకి పిల్లలు కనాలని ఉందట. కానీ పెళ్లే వద్దంటున్నాడు.. !!!