హౌస్‌ఫుల్-4 : ‘ఏక్ చుమ్మా..’ ఫుల్ వీడియో సాంగ్


బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘హౌస్‌ఫుల్-4’. ఈ చిత్రానికి ఫర్హాద్ సంఝీ దర్శకత్వం వహించారు. ఇందులో అక్షయ్ కి జంటగా కృతిసనన్, రితేశ్ దేశ్‌ముఖ్‌కు జంటగా పూజా హెగ్డే, బాబీ డియోల్‌కు జంటగా కృతి కర్బంద నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న హౌస్‌ఫుల్-4  ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏక్ చుమ్మా.. ‘ వీడియో సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ సాంగ్ లో మూడు జంటలు మెరిశాయ్. సాంగ్ కలర్ ఫుల్ గా ఉంది.

పునర్జమ్మల నేపథ్యంలో 1419, 2019 మధ్య కాలంలో సాగే కథ ఇది. వినోదాత్మకంగా తెరకెక్కించినట్టు ట్రైలర్ ని చూస్తే అర్థమయింది. ఇందులో అక్షయ్ కుమార్..రాజకుమారుడు బాలా, హ్యారీ పాత్రల్లో నటించారు. 1419కి చెందిన రాజకుమారుడు బాలా.. 600 ఏళ్ల తర్వాత లండన్ నుంచి హ్యారీగా ఎలా తిరిగొస్తాడనేది ఆసక్తిగా చూపించబోతున్నారని తెలుసోంది.