నయన్, తమన్నా రగిలిస్తున్నారు


ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఈ వారమే (అక్టోబర్2) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సైరా’. తొలిస్వాత్రంత్య్ర సరమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో చిరు నరసింహారెడ్డిగా, ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించారు.

దక్షిణాది అన్నీ బాషలతో పాటు హిందీలోనూ సైరా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచింది చిత్రబృందం. ప్రమోషన్స్ కోసం ఇటీవలే ముంబై వెళ్లిన చిత్రబృందం.. అటు నుంచి చెన్నై, ఆ తర్వాత బెంగళూరుని చుట్టొచ్చింది. అదే సమయంలో తెలుగు ప్రమోషన్స్ ని నిర్లక్ష్యం చేయడం లేదు. తాజాగా సైరా వీడియో సాంగ్ ని విడుదల చేశారు. 

ఇందులో రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరత్వం గురించి చెబుతూనే.. యుద్ధకాంక్ష, దేశభక్తిని రగిలించారు. తమన్నా, నయనతారలపై ఈ పాటని అద్భుతంగా చిత్రీకరించారు. వీరిద్దరు కలిసి రేనాటి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే సందర్భంలో వచ్చిన ఈ పాటగా ఇది కనబడుతోంది. ముఖ్యంగా మిల్కీ బ్యూటీ తమన్నా ధీరత్వం ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 
సైరా వీడియో సాంగ్ వచ్చేసింది !