విజయ్ తో రకుల్ కోరిక ఎప్పుడు తీరుతుందో ?
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన కోరికలని చాలా తెలివిగా బయటపెడుతుంటుంది. కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా యంగ్ హీరోలతో నటించింది రకుల్. ఆ సమయంలో సూపర్ స్టార్ మహేష్ అంటే పిచ్చి. ఆయనతో నటించడమే నా లక్ష్యం. ఆయనలో సినిమాలో ఛాన్స్ దొరికేవరకు అసలు పెళ్లి కూడా చేసుకోనని స్టేట్ మెంట్ ఇచ్చేసింది. ఆఖరికి స్పైడర్ సినిమాలో మహేష్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. మహేష్ తో కోరిక తీరిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని టార్గెట్ గా పెట్టుకొంది. కానీ, ఆ కోరిక తీరేలా లేదు.
ఎలా ఎప్పటికప్పుడు టార్గెట్ పెట్టుకొని.. వాటిని రీచ్ అవుతుంటుంది రకుల్. ఇప్పుడు రకుల్ టార్గెట్ బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్, ఇక టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ. వీరిద్దరిపై తనకు క్రష్ ఉంది. వారితో రొమాన్స్ చేయాలనుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మరీ.. విజయ్ తో రకుల్ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో ‘మర్జావన్’ చిత్రంలో నటిస్తోంది. ‘ఇండియన్-2’లో రకుల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.