రామ్ గిఫ్ట్’కు పూరి చిందులు


ఎనర్జిట్ హీరో రామ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ని తిరిగి నెలబెట్టాడు. ‘ఇస్మార్ట్ శంకర్’కి ముందు పూరి వరుస ప్లాపుల్లో ఉన్నాడు. రామ్ పరిస్థితి అంతే. ఐతే, పూరికి ఏ ఒక్క హీరో ఎస్ చెప్పలేదు. ఆయన చేతిలో కేవలం యాభై వేలు మాత్రమే ఉన్నాయట. అలాంటి పరిస్థితుల్లో పూరిని నమ్మ రామ్ ఇస్మార్ట్ శంకర్. అది కాస్త బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్లీ పూరి, రామ్ ఇద్దరూ ఫామ్ లోకి వచ్చారు. వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చిన తన బర్త్ డేని పూరి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొన్నారు. టాలెంట్ ఉండి లక్కు లేని దర్శకులకి పూరి సాయం చేశారు.

ఇక ఆదివారం (సెప్టెంబర్ 29) పూరి బర్త్ డే కానుకగా రామ్ ‘గోల్డ్‌ ఫాంటమ్‌’ స్పీకర్స్‌ను బహుమతి ఇచ్చాడు. దాన్ని చూసి పూరి మురిసిపోయాడు. చిన్న పిల్లాడిలా చిందులేశాడు. రామ్ కి థ్యాంక్స్ చెప్పాడు. దానికి సంబంధించిన వీడియోని ఛార్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘పూరీకి బర్త్‌డే కానుక ఇచ్చిన మా ఉస్తాద్‌ రామ్‌కి లవ్‌ యూ. ఆయన గాల్లో తేలుతున్నాడు’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ఛార్మి ట్వీట్‌ చూసిన రామ్‌ ‘హాహాహా…’ అని నవ్వుతూ రిప్లై ఇచ్చారు.