‘రొమాంటిక్’ ఫస్ట్ లుక్ !


దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రానికి పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. పూరికి జంటగా కేతికశర్మ నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. హీరో-హీరోయిన్స్ రొమాంటిక్ పిక్ ని కాదు.. శృంగార పిక్ లాంటిది ఒకటి వదిలారు. టాప్ లెస్ గా ఉన్న కేతికశర్మ ఆకాశ్ ని హత్తుకొని ఉంది. ఆమె బ్యాక్ అందాలని హైలైట్ చేస్తూ చూపించిన పిక్ ఇది. ఐతే, వారిలో కామం కనిపించడం లేదు. ఇద్దరు చాలా ప్రేమగా హత్తుకొన్నట్టు ఉంది పోస్టర్.

మొదటి నుంచి ఇది ‘ఇడియట్’ తరహా సినిమా అని చెబుతున్నారు. అది నిజమే అన్నట్టు ఫస్ట్ లుక్ నుంచే ‘రొమాంటిక్’లో ఇడియెట్ లక్షణాలు కనిపిస్తున్నాయ్. ఆంధ్రాపోరితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ పూరికి ఇంకా తొలి హిట్ పడలేదు. తన తండ్రి పూరి అందించిన రొమాంటిక్ కథతో ఆకాష్ హిట్ కొడతాడేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.