‘సైరా’ జ్యూక్ బాక్స్ వచ్చేసింది !


సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ వారమే (అక్టోబర్ 2) సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సైరా జ్యూక్ బాక్స్ ని విడుదల చేశారు. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సైరా జ్యూక్ బాక్స్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆయన సంగీతం అందించిన తొలి తెలుగు సినిమా ఇది.

సైరాలో మొత్తం నాలుగు పాటలున్నాయి. ఇందులో రెండు పాటలని సిరివెన్నెల సీతారామశాస్త్రీ, అనంత శ్రీరామ్, చంద్రబోస్ చెరో పాటని రాశారు. అన్నీ పాటలు అద్భుతంగా ఉన్నాయి. అమిత్ త్రివేది మంచి సంగీతాన్ని అందించారు. ఇక నేపథ్య సంగీతంలోనూ ఆయన మేజిక్ చేశారని చిత్రబృందం చెబుతోంది. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు, యుఎస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సింధు సైరా బాగుందంటూ కితాబిచ్చిన సంగతి తెలిసిందే.