‘హనీట్రాప్’లో మరో ట్విస్ట్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వెలుగులోకి వచ్చిన ‘హనీట్రాప్’లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయ్. హానీట్రాప్ కు బెంగళూరుతోనూ సంబంధాలు ఉన్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. హనీట్రాప్‌లో అధికారులు, ప్రముఖ నేతల ఫోన్‌లను ట్యాప్ చేయడంలో బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ పని చేసినట్టు భోపాల్ పోలీసులు గుర్తించారు.
బెంగళూరుకు చెందిన సంతోష్ నిర్వహిస్తున్న సైబర్ సేఫ్టీ, సైబర్ ఫోరెన్సిక్, ఫోన్ భద్రతకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. శ్వేతా సదరు సాఫ్ట్‌వేర్ ద్వారా చాటింగ్, ఎస్‌ఎంఎస్‌తోపాటు ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేసినట్టు తెలుస్తోంది. బ్లాక్ మెయిలర్, అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలను హనీట్రాప్ చేయడమే కాకుండా వారిని నిరంతరం ఫాలో అయ్యేవారని తెలుస్తోంది. ఇక మాజీ సీఎం, మాజీ గవర్నర్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హానీట్రాప్ లో ఇరుకొన్నట్టు తెలుస్తోంది.