దబాంగ్ 3 : చుల్ బిల్ పాండే ఈజ్ బ్యాక్ (వీడియో)


2010లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘దబాంగ్’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దర్శకుడు అభినవ్ కశ్యప్ సల్మాన్ ని చుల్ బుల్ పాండే అనే ఓ వైవిధ్యమైన పోలీస్ పాత్రలో చూపించి తన ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు. ఈ చిత్రంతోనే హీరోయిన్ సోనాక్షి సిన్హా వెండి తెరకు పరిచయమయ్యారు. కాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘దబాంగ్ 2’ కూడా వచ్చింది యావరేజ్ అనిపించుకొంది. ఇప్పుడీ సిరీస్ లో మూడో పార్ట్ దబాంగ్ 3 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా హీరోయిన్. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ విలన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్  కమెడియన్ అలీ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 20 దబాంగ్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టాడు సల్మాన్. ‘చుల్ బుల్ పాండే ఈజ్ బ్యాక్’ ప్రమోషనల్ వీడియో ఒకటి వదిలారు. ఇందులో తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. ఇప్పటి నుంచి చుల్ బుల్ పాండే ప్రమోషన్స్ మొదలయ్యాయ్. డిసెంబర్ 20వరకు, ఆ తర్వాత కూడా కొనసాగుతాయని తెలిపారు.