సైరాకు సీఎం జగన్ సపోర్ట్. కానీ.. !


మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాకు జగన్ సర్కార్ ఫుల్ సపోర్ట్ తెలిపింది. ఏపీలో సైరాని ఆరు షోలు నిర్వహించేందుకు అనుమతిని ఇచ్చింది. దాంతో బయ్యర్లు పండగ చేసుకొంటున్నారు. ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ మంచి కలెక్షన్స్ వస్తాయన్నది వారి ఆనందానికి కారణం. ఐతే, సైరా అదనపు షోలకి అనుమతి ఇచ్చిన జగన్ సర్కార్.. ఓ కండీషన్ కూడా పెట్టిందట. టికెట్ ధరలు అస్సలు పెంచడానికి వీల్లేదని చెప్పిందట. అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ముందే హెచ్చరినట్టు సమాచారమ్. 

ఇక, సైరా సినిమా వచ్చిన నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. కర్నూలు ప్రాంతానికి చెందిన తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా సైరా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉయ్యాలవాడ జయంతి వేడుకలని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారమ్. తద్వారా రేనాటి వీరుడికి తగిన గుర్తింపు ఇవ్వాలని సీఎం జగన్ భావిసున్నారట. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.