పంత్’కు చెక్.. సాహాకు ఛాన్స్
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు చెక్ పడింది. పంత్ ప్రతిభ ఉన్న ఆటగాడు. కానీ, పరిణతిగా ఆడటం లేదు. అనవసరమైన షాట్స్ తో అవుటైపోతున్నాడు. పరిస్థితులకి తగ్గట్టుగా ఆడటంలో విఫలవుతున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ కి కోచ్ రవిశాస్త్రీ, బీసీసీఐ నుంచి స్వీటి వార్నింగులు, స్ట్రాంగ్ వార్నింగ్ లు అయిపోయాయ్.
ఇప్పుడు పనిష్మెంట్ టైం వచ్చేసింది. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు పంత్ ని దూరం పెట్టేశారు. రేపటి నుంచి విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్టుకు పంత్ కి బదులుగా వృద్దిమాన్ సాహా ని తీసుకొన్నారు. కొద్దిసేపటి క్రితమే కెప్టెన్ కోహ్లీ టీమ్ ను ప్రకటించారు. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలో దిగనున్నారు. తెలుగుతేజం హనుమవిహారికి తుది జట్టులో స్థానం లభించింది. విశాఖ మైదానం పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో అశ్విన్, జడేజాలకు స్థానం కల్పించారు.
పూర్తి జట్టు ఇదే :
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ.