పీవీ సింధుతో కలిసి పృథ్వీ షా ప్రాక్టీసు
ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న యువ క్రికెటర్ పృధ్వీ షా. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నందుకు షాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నవంబర్ 15తో షాపై నిషేధం ముగియనుంది. ఈ నేపథ్యంలో తిరిగి టీమిండియాలొ స్థానం దక్కించుకొనేందుకు షా కఠిన శిక్షణ చేయనున్నాడు. ఫీల్డింగ్ లో షా వీక్ అనే ముద్రపడిపోయింది. ఆ ముద్రని చెరిపేసుకొనేందుకు కొత్త కసరత్తులు చేయనున్నాడు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి హైదరాబాద్‌లో సాధన చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫుట్‌వర్క్ మెరుగుపరచుకునేందుకు వృతి విలువలు పెంపొందించుకునేందుకు షా ఈ నిర్ణయం తీసుకున్నాడు.ఫుట్‌వర్క్ మెరుగుపరచుకునేందుకు దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ రెగ్యులర్‌గా బ్యాడ్మింటన్ ఆడేవాడు. బంతిని వీలైనంత త్వరగా గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ టేబుల్ టెన్నిస్ సాధన చేసేవారు. ఇపుడు షా కూడా బ్యాడ్మింటన్ ఆడనున్నాడు.