ఎన్ని థియేటర్స్ లో ‘సైరా’ రిలీజ్ అవుతుందో తెలుసా ?


ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సరమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో తెరకెక్కిన చిత్రమిది. సాహో తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న ప్యాన్ ఇండియా సినిమా ఇది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న సైరా రికార్డు స్థాయిలో రిలీక్ కాబోతుంది.

తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్స్ లో సైరా విడుదల కానుంది. ఇక దేశంలో అన్నీ బాషల్లో కలిపి 3600 థియేటర్స్ లో సైరా రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లో సైరా కు దాదాపు 1000 థియేటర్స్ దక్కాయని తెలుస్తోంది. ఈ లెక్కన ప్రపంచ వ్యాప్తంగా సైరా 4600 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సైరా తొలిరోజు రూ. 50కోట్ల గ్రాస్ ని తీసుకురావచ్చని ఆశిస్తున్నారు. ఐతే, బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సినిమా ‘వార్’ నుంచి సైరాకు గట్టిపోటీ ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో సైరా తొలిరోజు ఏ మేరకు రాబడుతుంది అనేది చూడాలి.

ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా సైరా రేపు (అక్టోబర్ 2) ప్రేక్షకుల ముందుకు రానుంది. అంకంటే ముందు ఈరోజు రాత్రికే యుఎస్ లో సైరా ప్రీమియర్స్ పడిపోనున్నాయి.