కేబినేట్ భేటీలో ఏం చర్చించబోతున్నారంటే ?


ఇవాళ సాయంత్రం 4గంటలకి తెలంగాణ కేభినేట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబుతున్నట్టు సమాచారమ్. ముఖ్యంగా కొత్త రెవెన్యూ చట్టం, నూతన సచివాలయం నిర్మాణంతో పాటు ఆర్‌టిసి కార్మికుల సమ్మె తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, అవినీతికి ఆస్కారం లేని కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలని సీఎం భావిస్తున్నారు.దీనిపై కొద్ది రోజులుగా సంబంధిత ఉన్నతాధికారులతో పలు దఫాలుగా చర్చలు కూడా జరిపారు. ఆ అంశాలపై కేబినేట్ లో చర్చించనున్నారు. ఇప్పటికే కొత్త రెవిన్యూ చట్టంపై అధికారులు కసరత్తు చేసి ముసాయిదాను రూపొందించారు. ఈ ముసాయిదాపై కెబినేట్‌లో చర్చ జరగనుందని తెలుస్తోంది.