అనిల్ కుంబ్లేకు మళ్లీ కోచ్ బాధ్యతలు ?


టీమిండియా ప్రధాన కోచ్ గా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సక్సెస్ అయ్యారు. కుంబ్లే నేతృత్వంలో టీమిండియా కరీబియన్‌ పర్యటనలో అద్భుతంగా రాణించింది. అలాగే స్వదేశంలోనూ 2016-2017 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫి ఫైనల్లో పాక్‌ చేతిలో టీమిండియా ఓటమిపాలైన ఈ నేపథ్యంలో కుంబ్లే తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో బేధాభిప్రాయాలు కూడా కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.

ఇప్పుడు అనిల్‌ కుంబ్లే మరోసారి కోచ్ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉన్నట్టు సమాచారమ్. ఐతే, టీమిండియాకు కాదు. ఆయన ఐపీఎల్‌లో కింగ్స్‌ XI పంజాబ్‌ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆ జట్టు యాజమాన్యంతో ప్రస్తుతం తుది విడత చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. పంజాబ్‌ జట్టు యాజమాన్యం త్వరలో నిర్వహించే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కుంబ్లే గతంలో ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు మార్గదర్శిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.