బండ్ల టైమింగ్ అదిరింది !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భక్తుల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్. పవన్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తీశారు. బడా నిర్మాతగా పేరొందిన బండ్ల ఆర్థిక సమస్యలతో సినిమాలకి దూరమైన సంగతి తెలిసింది. ప్రస్తుతం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో బండ్ల నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నిర్మాతగానూ బండ్ల రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకొంటున్నాడు.

ఈ నేపథ్యంలో మరోసారి బాస్ పవన్ కల్యాణ్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. కానీ అవి ఫలించలేదు. ఈ నేపథ్యంలో లిటిల్ బాస్ రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా కోరారు బండ్ల. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవింధుడు అందరివాడేలే చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. ఇప్పుడు మరోసారి చరణ్ ని కాకపడుతున్నాడు బండ్ల. మరీ.. చరణ్ ఆయన్ని కరుణిస్తాడేమో చూడాలి. ‘సైరా’ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో చరణ్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో బండ్ల టైమింగ్ అదిరింది. మంచి టైంలో చరణ్ ని రిక్వెస్ట్ చేశాడనే  కామెంట్స్ వినిపిస్తున్నాయి.