బిగ్ బాస్ 3 : ఈ వారంలో ఎలిమినేషన్ లోకి ఆ నలుగురు


కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3లో వారం వారానికి ఎంటర్ టైన్ మెంట్ డోస్ పెరుగుతోంది. ప్రతి శనివారం, ఆదివారాలు సరదా సరదాగా సాగినా.. షో సోమ, మంగళవారం ఎలిమినేషన్ ప్రాసెస్ తో హీటెక్కుతుంటుంది. ఈ వారం ఎమిలిమినేషన్ టాస్క్ పూర్తయింది. మొత్తం నలుగురు ఈ వారం ఎలిమినేషన్ లిస్టులోకి వచ్చారు. రాహుల్, వరుణ్ తేజ్, మహేష్ విట్టా, పునర్నవి ఎలిమినేషన్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.

నలుగురిలో వరుణ్ సందేష్ కి ఫ్యాన్ ఫ్యాలింగ్ బాగా ఉందని అర్థమవుతోంది. రాహుల్ అంతే. ఇక పునర్నవిని బయటికి పంపిస్తే బిగ్ బాస్ ఇంట్లో గ్లామర్ డోస్ తగ్గుతుంది. రాహుల్, పునర్నవి ఇంట్లో ఉంటేనే మజా. దాంతో వీరిద్దరు ఎలిమినేట్ కాకపోవచ్చు. ఇక మిగిలింది మహేశ్ విట్టా. ఈ వారం ఆయనే ఎలిమినేట్ కావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. మొదటి నుంచి బిగ్ బాస్ ఇంట్లో ఊహించినదే జరుగుతోంది. ప్రతివారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది ముందే తెలిసిపోతుంది. ఒకట్రెండు రోజులు ఆగితే.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు ? అన్నది తేలిపోనుంది.