బాలీవుడ్ ‘గీత గోవిందం’ హీరో ఎవరో తెలుసా ?


అర్జున్ రెడ్డి, గీత గోవిందం విజయ్ దేవరకొండని స్టార్ ని చేసిన సినిమాలు. వీటిలో అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో కబీర్ సింగ్ రిమేక్ అయింది. బాలీవుడ్ రిమేక్ కి మాతృక దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వం వహించారు. షాహిద్ కపూర్-కైరా అడ్వానీ జంటగా నటించారు. కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ‘గీత గోవిందం’ బాలీవుడ్ లో రిమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా రిమేక్ రైట్స్ ని ప్రముఖ దర్శకుడు రోహిత్‌ శర్మ సొంతం చేసుకున్నారు.

యాక్షన్‌ స్టంట్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు ఈ ప్రేమకథను తీయబోతున్నారు. రోహిత్‌ ఈ సినిమాకు నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారట. ఈ రీమేక్‌లో విజయ్‌ పాత్రలో యువ హీరో ఇషాన్‌ ఖత్తర్‌ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారమ్. మరీ దర్శకుడు ఎవరు ? బాలీవుడ్ గీత ఎవరు ?? అన్నది తెలియాల్సి ఉంది. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ కూడా బాలీవుడ్ లో రిమేక్ కానుంది. ఈ సినిమా రిమేక్ రైట్స్ ని ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తీసుకొన్నారు. బాలీవుడ్ డియర్ కామ్రేడ్ ని లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తీసుకురావాలనే ప్లాన్ లో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.