దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ : రోహిత్ హాఫ్ సెంచరీ
ఓపెనర్ గా రంగంలోకి దిగితే రోహిత్ శర్మకి పూనమ్ వస్తుటుంది. వన్డేల్లో ప్రపంచంలో నెంబర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్. కానీ, టెస్టులో ఆయన ఇంకా స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. మిడిల్ ఆర్డర్ లో పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో రోహిత్ ని టెస్టుల్లోనూ ఓపెనర్ గా పంపిస్తే.. టీమిండియా మరో సెహ్వాన్ లభించినట్టు అవుతుంది బీసీసీఐ భావించింది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీలో రోహిత్ ని ఓపెనర్ గా సెలక్ట్ చేశారు. విశాఖ వేదికగా ఈ ఉదయం ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన కోహ్లీ మొదటి బ్యాటింగ్ ఎంచుకొన్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా దిగిన రోహిత్ శర్మ(52; 84 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకంతో అదరగొట్టాడు.
మయాంక్ అగర్వాల్ (39; 96 బంతుల్లో 6×4, 1×6)తో కలిసి శుభారంభం చేశాడు. లంచ్ విరామానికి టీమిండియా ఒక వికెట్ కూడా నష్టపోలేదు. దీంతో 30 ఓవర్లు పూర్తయ్యేసరికి 91 పరుగులు సాధించింది. సన్నాహక మ్యాచ్‌లో పరుగులేమీ సాధించకుండా ఔటైన రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో ఎలా ఆడతాడోనని అంతా ఆందోళన చెందారు. ఐతే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. చూస్తుంటే టెస్టుల్లో ఓపెనర్ గా తొలి సెంచరీ చేసేలా కనిపిస్తున్నాడు హిట్ మ్యాన్.