ఇకపై ‘నాన్ బాహుబలి’ వినిపించదు !


తెలుగు నుంచి ‘బాహుబలి’ సినిమాని టచ్ చేసే సినిమా ఇకరాదు. రాబోదు అనుకొన్నారు. సినిమా కలెక్షన్స్ విషయంలోనూ ‘నాన్ బాహుబలి’ రికార్డ్ ని మాత్రమే టార్గెట్ గా పెట్టుకొంటున్నారు. బాహుబలి రికార్డుల జోలికి అస్సలు వెళ్లడం లేదు. ఇటీవలే వచ్చిన ప్రభాస్ ‘సాహో’ నాన్ బాహుబలి రికార్డులని తుడిస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. సాహో మిక్సిడ్ టాక్ తో ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి మరో ప్యాన్ ఇండియా సినిమా వచ్చేసింది. అదే మెగాస్టార్ సైరా. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన సైరాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చేసింది. దీనికితోడు ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. 

యుఎస్ ప్రీమియర్ కలెక్షన్స్ ద్వారానే 1మిలియన్ మార్క్ ని అందుకొంది. ఈ నేపథ్యంలో ఇకపై నాన్ బాహుబలి పదం వినిపించదు. ఆ రికార్డులన్నీ సైరా బ్రేక్ చేయబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే సైరా సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్న మాటలవి. వాస్తవానికి.. నాన్ బాహుబలి రికార్డుల్లో కొన్నింటిని మొదటగా చెరిపేసింది మెగాస్టార్ నే. ఆయన్ రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం. 150’తో కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులు బద్దలయ్యాయి. ఇప్పుడు సైరాతో అసలు నాన్ బాహుబలి పదమే వినిపించకుండా పోనుందని చెబుతున్నారు. ఇక సైరాపై సింగిల్ టాక్ బ్లాక్ బస్టర్ హిట్. ఈజోరుని చూస్తుంటే సైరా బాహుబలిని మించిన కలెక్షన్స్ సాధిస్తుందేమో చూడాలి.