సైరా.. సైరా.. సైరా.. !!
ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఇదే టాపిక్. ఎక్కడ విన్నా ఇదే సౌండ్. సైరా సౌండ్ తో దేశం మారుమ్రోగిపోతోంది. ట్రెండింగ్ లో టాప్ లో నిలిచాయ్ సైరాకు సంబంధించిన యాష్ ట్యాగ్స్. #SyeRaaNarasimhaReddy, #SyeRaaSensation, #syeraa, #MegastarChiranjeevi యాష్ ట్యాగ్స్ ట్విట్టర్ లో టాప్ లో నిలిచాయి. వివాదాస్ప వ్యాఖ్యలు చేయడం కాదు. కానీ గాంధీ జయంతి రోజున కూడా ఆయన్ని ట్రెండింగ్ టాప్ లో రానివ్వకుండా సైరా అడ్డుపడింది. ఆ రేంజ్ లో దేశంలో సైరా మానియా నడుస్తోంది. ఇక మెగా అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. దసరాని ఓ వారం రోజుల ముందుగానే జరుపుకొంటున్నారు.
థియేటర్స్ వద్ద డ్యాన్సులు, మెగాస్టార్ చిరంజీవి పోస్టర్స్ కి పాలాభిషేకాలు.. అబ్బో వారి హంగామాని మాటల్లో చెప్పడం కష్టం. ఇక కర్నూలులోని ఓ థియేటర్ వద్ద సైరా రిలీజ్ సందర్భంగా పొట్టేలుని బలి ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే మెగా అభిమానులు అయినందుకు సైరా ని చూసి, ఈ సినిమాకి వస్తున్న టాక్ ని చూసి గర్వంగా ఫీలవుతున్నారు. ఇంతటి ఆనందం మెగా అభిమానులకి ఇప్పట్లో మళ్లీ రాకపోవచ్చు. దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఇక యుఎస్ లో సైరా ప్రీమియర్ షోస్ పడిపోయాయ్. ముంబైలో మంగళవారం రాత్రే మీడియాలో కోసం స్పెషల్ షోస్ పడ్డాయి. ఏపీలో తెల్లవారుజామున నుంచే స్పెషల్ షోస్ పడ్డాయి. తెలంగాణలో మొదటి ఆట కొద్దిసేపటి క్రితమే మొదలైంది. మొత్తంగా ఇప్పటి వరకు సైరాపై నెగటివ్ టాక్ లేదు. సింగిల్ వర్డ్ సైరా బ్లాక్ బస్టర్.
సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో సైరా తెరకెక్కింది. కర్నూలుకు ప్రాంతానికి చెందిన తొలితరం స్వాతంత్య్ర సరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. రామ్ చాన్ నిర్మిసంచారు.