సైరా ట్విట్టర్ రివ్యూ


దేశం మొత్తం సైరా సౌండ్ తో మారుమ్రోగిపోతోంది. ఇక ఆన్ లైన్ లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రోగ్రామ్, యూట్యూబ్… ఏది తెరిచిన సైరా బొమ్మే. మెగాస్టార్ వీరత్వమే కనిపిస్తోంది. ముంబైలో రాత్రే సైరా బొమ్మ పడిపోయింది. అక్కడ మీడియాలో కోసం ప్రత్యేక సైరా ప్రత్యేక షోని ఏర్పాటు చేశారు. ఇక అమెరికాలో మంగళవారమే ప్రీమియర్స్ పడిపోయాయ్. దాంతో సైరా టాక్ ని ట్విట్టర్ వేదిక గా పంచుకొంటున్నారు సినిమా చూసిన అభిమానులు. సైరాపై సింగిల్ టాక్.. సినిమా అదిరింది. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. మెగాస్టార్ చిరంజీవి లైఫ్ టైం ఫర్ ఫామెన్స్ ఇచ్చారు. ఆయనకి జాతీయ అవార్డ్ ఖాయం అంటున్నారు.

తొలిస్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ‘సైరా’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ చారిత్రాత్మక చిత్రాన్ని కమర్షియల్ గా తెరకెక్కించడంలో దర్శకుడు సురేంధర్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. స్కీన్ ప్లే అద్భుతంగా ఉంది. యుద్ధ సన్నివేశాలు అదిరిపోయాయ్. ఇప్పటి వరకు వచ్చిన భారతీయ సినిమాల్లోనే ది బెస్ట్ యాక్షన్ సీన్స్ లా ఉన్నాయని అంటున్నారు. సినిమా కోసం ఎంత ఖర్చుపెట్టినా.. యాక్షన్ ఏ రేంజ్ లో ఉన్నా.. ఎమోషన్స్ పండాలి. సైరాకు అదే ప్లస్ అయింది. ఎమోషన్స్ బాగా పండాయ్. దాంతో కథతో ప్రేక్షకుడు ఈజీగా కనెక్ట్ అయ్యాడు. సాహోలో మిస్ అయింది అదే. సైరా మాత్రం
ఆ తప్పిదం చేయలేదు. చాలా గ్రిప్పింగా కథ-కథనం పండాయి. కథని ఎమోషనల్ చెప్పడంలో సక్సెస్ అయ్యారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పుకొంటున్నారు. నట విశ్వరూపం చూపించారు. నిజంగానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అచ్చం ఇలాగే ఉండేవారేమో అన్నట్టుగా చిరు నటన ఉందని చెప్పుకొంటున్నారు. యుద్ధం సన్నివేశాలు, డైలాగ్స్ రొమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. ఉరిరికంభం ముందు చిరు నటన ఒక్కటి చాలు అంటున్నారు. సైరాకు గానూ చిరు జాతీయ అవార్డు ఖాయమని చెబుతున్నారు. మెగా అభిమానులు అయినందుకు గర్వంగా ఫీలవుతున్నట్టు అభిమానులు ట్విట్ చేస్తున్నారు. సైరా విషయంలో ఒక్క నెగటివ్ టాక్ కూడా వినిపించకపోవడం విశేషం. మొత్తంగా.. సైరా బ్లాక్ బస్టర్ హిట్.. ఇక కలెక్షన్స్, రికార్డులు ఏంటన్నదానిపై ఫోకస్ పెట్టాల్సిందే.