సైరా సెలబ్రేషన్స్.. ఎంజాయ్ చేస్తున్న ఉపాసన ! 


మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ విడుదల నేపథ్యంలో మెగా అభిమానులు పండగ చేసుకొంటున్నారు. సెలబ్రేషన్స్ తో థియేటర్స్ మోత మ్రోగిపోతున్నాయ్. దానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్నింటిని మెగాస్టార్ కోడలు ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. వీటిలో చిరు భారీ కటౌట్ వీడియో ఒకటి ఉంది. బెజవాడలో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన మరో వీడియోని ఉపాసన షేర్ చేశారు. బెజవాడబీట్ బాగుంది అంటూ కామెంట్ పెట్టారు. మరో ఒకట్రెండు సైరా సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియోలని ఆమె షేర్ చేశారు. మొత్తంగా సైరా సెలబ్రేషన్స్ ని ఉపాసన ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ‘సైరా’ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. చారిత్రాత్మక చిత్రాన్ని కమర్షియల్ గా తెరకెక్కించడంలో సురేంధర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. నరసింహారెడ్డి పాత్రలో చిరు జీవించేశారు. ఈ సినిమాకి గానూ చిరుకి  జాతీయ అవార్డ్ ఖాయం అంటున్నారు. కథ-కథనం అద్భుతంగా కుదరడంతో పాటు ఎమోషన్స్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. బాహుబలికి తక్కువ సాహో కంటే ఎక్కువలా సైరా ఉందని చెప్పుకొంటున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ లో బాహుబలి 2 రికార్డ్స్ కొన్ని బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఆనందంలో సైరా చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కి ఏర్పాట్లు చేసుకొంటున్నట్టు సమాచారమ్