మందు బాబులు.. ఇక తొందరక్కర్లేదు !
రాత్రి పది అయితే వైన్ శాపులు మూసేస్తారని పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. టైం అయిపోతుందని పెగ్గుల మీద పెగ్గులు పీకాల్సిన పనిలేదు. తెలంగాణ నూతన మధ్యం పాలసీలో మందుబాబులు పండగ చేసుకొనే నిర్ణయం ఒకటి తీసుకొంది. మునుపటిలా రాత్రి పది గంటలకే వైన్స్ శాప్ మూతపడవు. ఇకపై రాత్రి 11గంటల వరకు వైన్ శాప్స్ తెరిచే ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగితా అన్నీ చోట్ల వైన్స్ షాప్స్ ఉదయం 10గంటల నుంచి రాత్రి 11వరకు తెరిచే ఉండనునాయి.
గ్రేటర్ హైదారాబాద్ లో మాత్రం ఉదయం 11గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉండనున్నాయి. అంతేకాదు.. వైన్ షాప్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఫీజు ను భారీగా పెంచి షాకిచ్చారు. లక్ష రూపాయలు ఉన్న దరఖాస్తు ఫీజును రెండు లక్షలకు పెంచేశారు. ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు. గతంలో మాదిరిగానే లాటరీ విధానంలోనే మద్యం షాపులను ఎంపిక ఉండనుంది. ఐతే గతంలో ఉన్న నాలుగు స్లాబ్ లను 6 స్లాబు గా మార్చిర్చారు. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ దరఖాస్తు ఫీజును నిర్ణయించింది. నూతన మధ్యం పాలసీపై మందు బాబులు హర్షం వ్యక్తం చేయగా.. దరఖాస్తు చేయాలనుకొనేవారు పెదవి విరుస్తున్నారు.