‘సామజవరగమన’ ఇంత మంది లైక్ కొట్టారు !


త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. బాలీవుడ్ నటి టబు కీలకపాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలని ఈ దసరాకే మొదలెట్టారు. సినిమాలో తొలిసాంగ్ ‘సామజవరగమన’ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకొన్న ఈ సాంగ్ కు 5లక్షల లైకులు లభించడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఇప్పుడీ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

గతంలో త్రివిక్రమ్-బన్నీ కలయికలో వచ్చిన జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలో వీరి కలయికలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం అల.. వైకుంఠపురంలో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన రెండు ఫోస్టర్స్ ప్రేక్షకులని కన్ఫూజన్ లో పడేశాయి. మొదటి లుక్ లో బన్నీ పల్లెటూరి కుర్రాడిలా, దసరా బుల్లోడిలా కనిపిస్తున్నాడు. ఇక రెండో లుక్ లో స్టయిలీష్ లుక్ లో సాఫ్ వేర్ ఉద్యోగిలా కనిపిస్తున్నారు. ఈ రెండు షేడ్స్ ని తెరపై ఎలా చూపించబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.