చాణక్య.. ఇది కొత్త కథ !
తమిళ దర్శకుడు తిరు కృష్ణమూర్తి దర్శకత్వంలో గోపీచంద్ నటించిన చిత్రం ‘చాణక్య’. మ్రెహ్రీన్ కథానాయిక. బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ కీలకపాత్రలో నటించారు. దసరా కానుకగా రేపు (అక్టోబర్ 5) ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’తో బాక్సాఫీస్ యుద్ధానికి దిగనుంది. ఇది సాహాసమేనని అందరూ అంటున్నా. తప్పలేదని చాణక్య చిత్రబృందం చెబుతోంది.
ఇక ఈ సినిమా సల్మాన్ ఖాన్ ‘ఏక్తా టైగర్’కు రిమేక్ అనే ప్రచారం మొదటి నుంచి జరుగుతోంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో దర్శకుడు తిరు ఈ ప్రచారంపై స్పందించారు. అసలు ఇది కాపీ కథ కాదు. ఏ చిత్రానికి రిమేక్ కాదు. ఇది కొత్త కథ. ఈ సినిమా స్క్రీన్ప్లే రాసుకోవడానికి ముందు కొన్ని గూఢచారి సంస్థలైన ‘ఐ ఎస్ఐ, సీఐఏ, రా’ వంటి వాటి గురించి బాగా చదివాను. స్పై ఏజెంట్స్ ఎలా ఉంటారు ? వారి బాడీ లాంగ్వేజ్ ఏంటి ? ఇలాంటి చాలా విషయాలపై రీసెర్చ్ చేసి రాసుకొన్న కథ ఇది. ‘రా’ ఆఫీసర్ రవీంద్ర కౌశిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని కలవడానికి ప్రయత్నించా. కుదరలేదు. ఆయన్ని స్పూర్తిగా కథ రాసుకొన్నా అన్నారు.
గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలలని పూర్తి చేసుకొంది. యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. అనిల్ సుంకర నిర్మించారు. చాణక్య హిట్ అయితే.. చాణక్య 2 రానుంది. ఈ మేరకు దర్శకుడు తిరు ఓ ప్రకటన కూడా చేశారు.