శ్రీముఖి పెళ్లి కామెడీ !
హాట్ యాంకర్ శ్రీముఖి ఎఫైర్స్ పై బయట బాగానే గాసిప్స్ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లోనూ శ్రీముఖి పెళ్లి మేటర్ హాట్ టాపిక్ గా మారింది. హౌస్ సభ్యులు శ్రీముఖి లేని సమయంలో ఆమె పెళ్లి గురించి సీరియస్ గా మాట్లాడుకొన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే శ్రీముఖి పెళ్లిపై సటైర్స్ వేసుకొన్నారు. శ్రీముఖి వాగుడుకాయ్ అన్న సంగతి తెలిసిందే. గబా గబా మాట్లాడేస్తుంటుంది. స్రీన్ మొత్తం ఆక్రమించేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఏపీసోడ్ లో రాహుల్, వరుణ్, వితికా శ్రీముఖి పెళ్లిపై జోకులేసుకొన్నారు.
పెళ్లైన తర్వాత కూడా శ్రీముఖికి ఇలాగే అరుస్తుందేమోనని రాహుల్ వరుణ్ తో గుసగుసలాడారు. శ్రీముఖి అరుపులకి వాడు ఇయర్ ఫ్లగ్స్ కొనుక్కుంటాడేమోనని సెటైర్ వేశాడు. ఇక పునర్నవి లేవగానే తనని ఎదవ అంటుందని వరుణ్ దగ్గర బాధపడిపోయాడు రాహు. అది నీ మీద ప్రేమ అంటోందని వరుణ్ కటింగ్ ఇచ్చాడు. అది ఎలా అంటుందో ఏమోగానీ తనకి మాత్రం నచ్చడంలేదన్నాడు రాహుల్. ఇదంతా వింటున్నా వితికా.. వారిద్దరి మధ్యకి వెఌతే.. మనే ఎర్రోళ్లం అవుతామని కామెంట్ చేసింది. మొత్తానికి.. సోమవారం ఏపీసోడ్ లో శ్రీముఖి పెళ్లి టాపిక్ హైలైట్ అయింది. దాన్ని ఆమె అభిమానులు ఎంజాయ్ చేశారు.