అశ్విన్ రికార్డ్ బౌలింగ్


టీమిండియా స్పిన్నర్ అశ్విన్ టెస్టుల్లో 350 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు చివరి రోజు ఉదయం టీమిండియా బౌలర్లు శుభారంభం చేశారు. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్ లోనే రవిచంద్రన్ అశ్విన్ డిబ్రుయిన్ (10)ను బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ తో అశ్విన్ టెస్టులో 350వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక వేగంగా 350వికెట్లు పడగొట్టిన బౌలర్ గా రికార్డ్ సృషించాడు. ముత్తయ్య మురళీధరన్ 66 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా అశ్విన్ కి కూడా ఇది 66వ మ్యాచ్ కావడం విశేషం. 

ఇక తొలి టెస్టు చివరి రోజు దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 12 ఓవర్లకు 20 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం మార్ క్రమ్, డుప్లెసిస్ క్రీజులో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా గెలవడానికి ఇంకా ఏడు వికెట్ల దూరంలో ఉంది.