కార్మికులు ఇప్పుడు ప్రభుత్వానికి బరువయ్యారా ?  


తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. దసరా పండగ సీజన్ కావడంతో ప్రయాణికులకి ఇక్కట్లు తప్పడం లేదు. మరోవైపు సమ్మెని తీవ్రతరం చేసేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రణాఌకలు సిద్ధం చేసుకొంటున్నారు. వారికి ప్రతిపక్షాల మద్దతు కూడా వీరికి లభిస్తోంది. ఇప్పటికే తెజస అధ్యక్షుడు కోదండరామ్ కార్మిక సంఘాలకు మద్దతు తెలిపారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. 

హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బట్టీ మాట్లాడుతూ.. భయపెట్టి సమస్యను పరిష్కరించాలనుకోవడం ప్రజాస్వామ్యం కాదన్నారు. సీఎం కేసీఆర్ అధికార అహంకారం పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు. ఒక్క మాటతో ఉద్యోగాలు పోతాయనటానికి ఇది రాజరికం కాదని మండిపడ్డారు. సమ్మె చేయడం ప్రజాస్వామ్యంలో అందరి హక్కు అన్నారు. రాష్ట్ర సాధన కోసం అప్పట్లో కృషి చేసిన కార్మికులు ఇప్పుడు ప్రభుత్వానికి బరువయ్యారా?అంటూ మండిపడ్డారు.  ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకలజనుల సమ్మె సమయంలో రాష్ట్రస్థాయి కార్మిక నాయకుల అరెస్టులపై కేసీఆర్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు.