బిగ్ లీక్ : ఈ వారం పునర్నవి అవుట్


బిగ్ బాస్ 3 పదకొండో వారం పూర్తి చేసుకోనుంది. ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో రాహుల్, వరుణ్ తేజ్, పునర్నవి, మహేష్ విట్టా ఉన్నారు. వీరిలో రాహుల్ సేఫ్ అయినట్టు శనివారమే నాగ్ ప్రకటించారు. అంతేకాదు.. ఈ వారం రాహుల్ కే అత్యధిక ఓట్లు వచ్చినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో మిగిలిన ముగ్గురు వరుణ్, మహేష్ పునర్నవిలలో మహేష్ ఎలిమినేట్ అవుతారని అందరు భావించారు. కానీ, పునర్నవి ఎలిమినేట్ అయింది. ఈ మేరకు బిగ్ లీకు బయటికొచ్చింది. ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే వార్త ముందుగానే లీకవ్వడం. అది నిజమవ్వడం చూస్తున్నాం. ఈ వారం పునర్నవి ఎలిమినేట్ అయింది.

ఇది పక్కా. బిగ్ బాస్ ఇంట్లో రాహుల్-పునర్నవిలు ప్రేమపక్షులుగా తిరిగేవారు. ఈవారంతో ఈ జంట విడిపోయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఇంట్లో అసలైన ఆట ఇప్పుడే మొదలు కానుందనే విషయం అర్థమవుతోంది. ఇక ఈవారం ఏపీసోడ్ లో నాగ్ ఏదైనా అవతారంలో ఎంటర్ టైన్ చేయమని సభ్యులకి చెప్పడం.. వాళ్లు ఓ రేంజ్ లో రెచ్చిపోవడం ఇప్పటికే విడుదలైన ప్రోమోల్లో చూశాం. ఈ వారం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తోంది.. పునర్నవికి రాహుల్ ఏ విధంగా వీడ్కోలు చెప్పబోతున్నాడని… !