గ్రేట్ : వారికి సన్నీ సాయం


బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ గొప్ప  మనసు చాటుకొన్నారు. సన్నీ తను వేసిన పెయిటింగ్ ను వేలానికి పెట్టారు. అలా వచ్చిన డబ్బును క్యాన్సర్ బాధితులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 

“నా పెయింటింగ్ పూర్తయ్యింది. క్యాన్సర్ తో పోరాడుతున్న నిరుపేదలకు నా వంతు ఆర్థికసాయం అందచేయడం కోసం ఈ పెయింటింగ్ ను వేలానికి పెడుతున్నాను. ఈ పెయింటింగ్ వేసేటప్పుడు వారి గురించే  ఆలోచించాను. క్యాన్సర్ తో పోరాడుతున్న నిరుపేదలకు ఆర్థికసాయం చేయండి” అని సన్నీ రాసుకొచ్చారు. ఇటీవల విడుదలైన అర్జున్ పాటియాలా చిత్రంలో సన్నీ మెరిశారు. ప్రస్తుతం సన్నీ స్ల్పిట్స్ విల్లా సీజన్ రియాల్టీ షోలో బిజీ ఉన్నారు. హార్రర్, కామెడీ నేపథ్యంలో సాగే కోకా కోలా సినిమాలో నటించనున్నారు.