‘అల.. వైకుంఠపురంలో’ దసరా పోస్టర్ వచ్చేసింది !

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ఠ్స్, హారిక & హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ వచ్చేసింది. త్రివిక్రమ్ మార్క్ యాక్షన్ సీన్ కి సంబంధించిన పోస్టర్ ఇది. పోస్టర్ తో ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ పోస్టర్ ని చూస్తే అత్తారింటికి దారేది సినిమాలో హీరోయిన్ ప్రణీతని పెళ్లి పీఠల నుంచి ఎత్తుకొచ్చే క్రమంలో పవన్ చేసిన ఫైట్ లా కనిపిస్తోంది. చున్ని తో బన్నీ యాక్షన్ లోకి దిగినట్టు పోస్టర్ లో కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన తొలి పాట సామజవరగమన అద్భుతంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.