బాలీవుడ్ హీరో కూతురుతో రాహుల్ డేటింగ్ !


టీమిండియా బ్యాట్స్ మెన్ కె ఎల్ రాహుల్ మరోసారి రెడ్ హ్యాండెండ్ గా దొరికిపోయాడు. ఎఫైర్స్ నడపడంలో మనోడు మొనగాడు. గతంలో హీరోయిన్లు నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాంక్ష రంజన్ లతోనూ చట్టపట్టాలేసుకుని తిరిగాడు. వీళ్లకి సంబంధించిన రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రికెటర్ తాజాగా సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో కనిపించాడు.

గత కొంతకాలం నుంచే ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు బాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ.. ఈ జంట ఓ స్టార్ హోటల్ లో కెమెరాకు చిక్కింది. ముంబైలోని ఓ ప్రముఖ హోటల్ కు వీరిద్దరూ డిన్నర్ డేట్ కు వచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. టీమిండియా టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయిన రాహుల్  ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ పోటీల్లో కర్ణాటక తరఫున ఆడుతున్నాడు. ఖాళీ సమయం చూస్తుకొని ఇలా.. అమ్మాయిలతో డేట్ కి వెళ్తున్నాడు.