నయన్ అందాల ట్రీట్

స్టార్ హీరోయిన్ నయనతార చాన్నాళ్ల తర్వాత అందాల ట్రీట్ ఇచ్చింది. ఇటీవలకాలంలో నయన్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. హిట్స్ కొడుతోంది. నటనతో సప్రైజ్ చేస్తోంది. ఇదంతా ఒకే. ఆమె అభిమానులు ఖుషి. కానీ నయన్ నుంచి గ్లామర్ మిస్ అవుతున్నారు. ఇప్పుడా లోటుని తీర్చేసింది నయన్. వోగ్ ఫోటో షూట్ కోసం హాట్ హాటుగా పోజులిచ్చింది. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అందం చూడ్డానికి రెండు నయనాలు సరిపోవడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ‘సైరా’లో నయన్ మెగాస్టార్ కి జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య పాత్రలో అద్భుతంగా నటించింది. బాబు బంగారం తర్వాత తెలుగులో నయన్ నటించిన సినిమా ఇది. ప్రస్తుతం నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఇక విఘ్నేష్ తో నయన్ పెళ్లి ఈ యేడాది కూడా ఉండకపోవచ్చని కోలీవుడ్ సమాచారమ్. పెళ్లికాకపోయినా.. ఈ ప్రేమ జంట కలిసే ఉంటున్నారని సమాచారమ్. అందుకే పెళ్లికి తొందరెందుకు ? కొన్నాళ్లు ఆగి చేసుకొందామని ఈ జంట అనుకొంటున్నారట.