బిగ్ బాస్ హౌస్’లో గ్లామర్ మిస్


బిగ్ బాస్ 3 విజయవంతంగా పదకొండో వారాన్ని పూర్తి చేసుకొంది. ఈ వారం హౌజ్‌ నుంచి పునర్నవి ఎలిమినేట్ అయింది.  ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్‌ లిస్ట్‌లో పునర్నవితో పాటు రాహుల్‌, వరుణ్‌, మహేశ్‌ ఉండగా.. పునర్నవికి తక్కువ ఓట్లు పడడంతో ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. మహేశ్‌ తృటిలో ఎలిమినేషన్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 

ఇక పునర్నవి ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ మిస్సయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పునర్నవి బయటికి వెళ్లి నాగ్ తో కలిసి స్టేజ్ పై మాట్లాడుతున్న సమయంలో.. రాహుల్ పునర్నవి కోసం ఓ పాట పాడుతూ ఏడవడం అందరినీ ఎమోషనల్ కి గురిచేసింది. బాగా ఎంటర్ టైనర్ చేస్తున్న రాహుల్, పునర్నవి మరో ఒకట్రెండు వారాలు హౌస్ లో ఉంటారని అందరు భావించారు. ఈ వారం మహేష్ ఇంటి నుంచి బయటికెళ్లే ఛాన్స్ ఉందని భావించారు. ఐతే, వారంలో జరిగిన అన్నీ టాస్క్ ల్లోనూ మహేష్ మంచి ఎఫర్ట్ పెట్టి ఆడి.. వినోదాన్ని పంచడంతో తృటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకోగలిగాడు.