‘ఆర్ఆర్ఆర్’ తెలుగు టైటిల్ ఏంటంటే ?


ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు రూ.400కోట్లపైగా బడ్జెట్’తో డీవీవీ దానయ్య సినిమాకు నిర్మిస్తున్నారు. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక సినిమాకు సరిపోయే టైటిల్ ను చెప్పాలని ఫ్యాన్స్ ను రాజమౌళి కోరగా, ఎన్నో టైటిల్స్ వచ్చాయి. ఇప్పుడీ సినిమా టైటిల్ కు సంబంధించిన ఓ లీక్ బయటికి వచ్చింది. ఈ చిత్రానికి ‘రామ రౌద్ర రుషితం’ అన్న టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారమ్. ఇక ఇతర భాషల కోసం ‘రైజ్ రివోల్ట్ రివెంజ్’ అన్న టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.