తేజు టైటిల్ : సోలో బ్రతుకే సో బెటర్


‘చిత్రలహరి’తో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండగే’ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ ప్లాన్ చేశారు. తాజాగా తేజు కొత్త సినిమా ప్రారంభం అయింది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. దిల్ రాజు బ్యానర్ నిర్మించనుంది. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సోలో బ్రతుకే సో బెటర్ యూత్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. చిత్రలహరికి ముందు వరుసగా మాస్, యాక్షన్ కథలతో అభిమానులకి బోర్ కొట్టించాడు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో మళ్లీ మాస్-యాక్షన్ కథల వైపు చూడకూడని తేజు నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుసగా ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ ప్లాన్ చేసుకొంటున్నాడు.