‘వెంకీమామ’ దసరా కానుక


అభిమానులకి దసరా కానుకలు క్యూ కడుతున్నాయి. పండగ పూట సినిమా లుక్, పిక్ లు, టీజర్స్, సాంగ్స్ క్యూ కడుతున్నాయి. తాజాగా ‘వెంకీమామ’ ఫ్యామిలీతో కలిసి వచ్చేశాడు. వెంకటేష్-పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్య-రాశీఖన్నా ట్రాక్టర్ పై వెళ్తున్న పోస్టర్ ఒకటి వదిలారు. రేపు (అక్టోబర్8) ఉదయం 11గంటలకి వెంకీమామ ఫస్ట్ గ్లిప్స్ విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ పై పేర్కొన్నారు.

ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఎఫ్ 2 తర్వాత వెంకీ, మజిలీ తర్వాత నాగ చైతన్య నటిస్తున్న చిత్రమిది. వెంకీమామ కథ చాలా బాగుంటుంది. నాన్ స్టాప్ గా నవ్వులు పూయించే సినిమా ఇదని ఇప్పటికే వెంకీ చెప్పారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో వెంకీమామని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.