దసరా స్పెషల్ : బిగ్ బాస్ హౌస్‌’లోకి సోగ్గాడు


బిగ్ బాస్ దసరా స్పెషల్ అదిరిపోయింది. మంగళవారం దసరా సందర్భంగా నాగ్ హౌస్‌మేట్స్‌తో కలిసి సందడి చేశారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’లో బంగార్రాజు పాత్ర గెటప్‌లో వచ్చి ఇంటి సభ్యులను ఆకట్టుకున్నారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ఆటపట్టిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంటి సభ్యులకు మిఠాయిలు, బహుమతులు అందజేశారు. ఇక దసరా సందర్భంగా హౌస్‌లో ఫుడ్‌మేళా నిర్వహించారు. ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విభజించిన బిగ్‌బాస్‌ వారితో చైనీస్‌, ఆంధ్రా వంటకాలు, స్వీట్లను తయారు చేయించారు. వారు తయారు చేసిన వంటలను నాగార్జున రుచి చూశారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ లో తారక్ బిగ్ బాస్ హౌస్‌’లోకి వెళ్లారు. స్వయంగా బిర్యానీ చేసి ఇంటి సభ్యులకి పెట్టాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 లో నూ నాని బిగ్ బాస్ హౌస్‌’లోకి వెళ్లి సందడి చేశారు. ఇప్పుడు దసరా సందర్భంగా నాగ్.. ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు.  బుధవారం ప్రసారంకానున్న ఎపిసోడ్‌లో సైతం బిగ్‌బాస్‌ ఇంట్లో నాగార్జున సందడి కొనసాగనుంది.