ఆర్టీసీ ఎఫెక్ట్ : సీపీఐ యూటర్న్


హుజూర్ నగర్ ఉప ఎన్నికలో సీపీఐ తెరాసకు మద్దతిచ్చిన సగంతి తెలిసిందే. ఐతే, ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ తో సీపీఐ యూటర్న్ తీసుకొనేలా కనబడుతోంది. ఆర్టీసీ సమ్మె ఐదో రోజుకి చేరుకొంది. సమ్మెని మరింత ఉదృతం చేయాలని అఖిలపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అఖిలపక్షాల సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం చర్యల వల్లే ఆర్టీసీ సమ్మె అని వార్యమైందని.. తక్షణమే ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టాలని అక్షలపక్షం డిమాండ్ చేసింది. మరో సకలజనుల సమ్మెకు సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఆర్టీసీ సమ్మె..సకల జనుల సమ్మెగా మారుతుందని కోదండరాం హెచ్చరించారు. మరోవైపు, ఆర్టీసీపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేని యెడలహుజూర్ నగర్ లో తెరాసకు మద్దతుపై పునరాలోచిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు.