జాలీ దయ లేకుండా ఆరు హత్యలు


ఆమె పేరు జాలీ. ఆమెకు లేనిదే అది. జాలీ దయ లేకుండా ఆరుగురిని హత్య చేసింది. కేరళలోని కోజికోడ్ లో సంచలనం సృష్టించిన 6 వరుస హత్యల ఘటన నిందితురాలు జాలీ గురించి సిట్ షాకింగ్ విషయాలు వెల్లడిండించింది. మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులను సైనేడ్ ను ఆహారంలో కలిపి చంపిన ఆమె.. మరో ఇద్దరు పిల్లల్ని సైతం అంతమొందించాలని చూసిందని పేర్కొన్నారు. 

2002లో అన్నమ్మ థామస్ తో హత్యలు మొదలు పెట్టిన జాలీ వరుస హత్యల కేసును విచారణ చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కుమార్తెనూ విషం పెట్టి చంపాలని ప్రయత్నించినట్లు సిట్ తెలిపింది. అంతేకాదు.. నిందితురాలు జాలీకి  ఆడపిల్లలంటే పడదని తేలింది. ఆ కోపంతోనే మొదటి భర్త సోదరి కుమార్తె ఆల్ఫైన్ ను అంతమొందించిందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.