రాజశేఖర్ పెద్ద ఫ్రాడ్
సీనియర్ నటుడు రాజశేఖర్ పెద్ద ఫ్రాడ్ అట. ఈ విషయాన్ని ఆయన సతీమణి, నటి జీవితనే చెప్పారు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. అయినా.. రాజశేఖర్ ని జీవిత ఫ్రాడ్ అని పిలుస్తుంటుంది. ఎందుకంటే ? వీరిద్దరు కలిసి నటించిన తొలి చిత్రం ‘తలంబ్రాలు’. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఐతే, ‘తలంబ్రాలు’ సినిమాలో రాజశేఖర్ పాత్ర ఫ్రాడ్ లా ఉంటుంది. అందుకే అప్పటి నుంచి ఆయన్ని ఫ్రాడ్ అని పిలుస్తుంటుందట. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు జీవిత.
ఇక, ‘మగాడు’ చిత్రీకరణలో ప్రమాదం జరగడంతో రాజశేఖర్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించారట. అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఊళ్లో లేరు. సర్జరీ అయిపోయిన తర్వాత వచ్చారు. అప్పటికే నేను ఆస్పత్రిలో ఉన్నా. వాళ్ల ముందు కూడా ఆయనను ‘ఫ్రాడ్.. ఫ్రాడ్’ అని పిలిచేదాన్ని. అప్పుడు రాజశేఖర్ అమ్మగారు పిలిచి ‘అంతా బాగానే ఉంది. ఫ్రాడ్ ఏంటీ. సరిగ్గా పిలువు. నాకు నచ్చలేదు’ అన్నారు. దీంతో అప్పటి నుంచి ఆయనను ‘బంగారం’ అని పిలవడం మొదలు పెట్టానని చెప్పుకొచ్చింది జీవిత. అన్నట్టు.. రాజశేఖర్ కు శ్రీదేవిని పెళ్లి చేసుకోమని ప్రపోజల్ వచ్చిందట. అప్పటికే శ్రీదేవి హీరోయిన్ అయింది. ఆమె తన మెంటాలిటికి సరిపోతుందో ? లేదోనని రాజశేఖర్ ఆలోచించారట. ఆ తర్వాత జీవితతో ప్రేమ, పెళ్లి జరిగిపోయాయట.