రస్మిక-విజయ్ ముద్దుని కాపీ కొట్టారట !


రష్మిక-విజయ్ లది హిట్ పెయిర్. ‘గీత గోవిందం’ కోసం తొలిసారి జతకట్టారు. ఆ వెంటనే డియర్ కామ్రేడ్ సినిమా కోసం మరోసారి జతకట్టారు. ఈ రెండు సినిమాల్లోనూ రస్మిక-విజయ్ ల కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఇక వీరి లప్ లాక్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. తాజాగా రష్మిక-విజయ్ లిప్ లాక్ సన్నివేశాల గురించి హీరోయిన్ హరిప్రియ కామెంట్ చేసింది. ప్రస్తుతం హరిప్రియ ఎల్లిదే ఇల్లితనకా అనే కన్నడ చిత్రంలో నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ‘గీత గోవిందం’ సినిమాలో తరహా లిప్ లాక్ సీన్ ఉంది.

దీనిపై హరిప్రియ స్పందిస్తూ.. “ఎల్లిదే ఇల్లితనకా చిత్రంలోని ముద్దు సన్నివేశాన్ని  గీత గోవిందం లోని ముద్దు సన్నివేశంతో ప్రేక్షకులు పోల్చి చూస్తున్నారు. గీత గోవిందం సినిమాలో రష్మిక-విజయ్ దేవరకొండల మధ్య అధర చుంబనం జరిగింది. కానీ నేను నటించిన  ఎల్లిదే ఇల్లితనకా సినిమాలో మా మధ్య మామూలు ముద్దు సన్నివేశం మాత్రమే జరిగింది” అని చెప్పుకొచ్చింది. తకిట తకిట, పిల్ల జమిందార్,  జైసింహా తదితర చిత్రాలతో హరిప్రియ తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.