షాక్ : జగ్గారెడ్డికి రూ.100కోట్ల అప్పు


సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. శుక్రవారం సంగారెడ్డిలో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగ్గారెడ్డి.. టిఆర్ఎస్, బిజెపిలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడనని ప్రకటించారు. తన అనుచరులు కూడా ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని సూచించారు. తన అప్పుల బాధలని అనుచరులతో పంచుకొన్నారు.

తాను అప్పుల్లో కూరుకుపోయానని, ఒక్కపైసా సంపాదించలేకపోయానని జగ్గారెడ్డి అన్నారు. కనీసం తన భార్యకు 20 తులాల బంగారం కూడా కొనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏకంగా వంద కోట్ల రూపాయల అప్పులున్నాయని జగ్గారెడ్డి వెల్లడించారు. ఐతే, తన ఆస్తుల గురించి మాత్రం చెప్పలేదు. ఇక తెరాస, బీజేపీలపై మాట మాట్లాడను, తన అనుచరులు కూడా రెండు పార్టీలపై విమర్శలు చేయొద్దన్న జగ్గారెడ్డి ఆంతర్యం ఏంటన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఆయన త్వరలో కారు లేదంటే కమలం పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్.