కొల్లు రవీంద్ర అరెస్ట్

ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఇసుక కష్టాలను ప్రశ్నిస్తూ.. కొల్లు రవీంద్ర సహా పలువురు 36 గంటల నిరవధిక దీక్షకు దిగారు. దీంతో ర్యాలీలు, సమావేశాలు నిషేధిస్తూ.. యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు పోలీసులు. ముందస్తు చర్యగా కొల్లు రవీంద్ర సహా ఇతర నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. 

ఇంటి నుంచి తప్పించుకొని బయటపడిన కొల్లు రవీంద్ర కోనేరు సెంటర్‌లో దీక్షకు కూర్చున్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు యాక్ట్ 30ని అమలు చేస్తూ.. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు. ఆ సమయంలోఅక్కడ టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ జరిగిన తోపులాటలో కొల్లు రవీంద్ర స్వల్పంగా గాయపడినట్టు సమాచారమ్.