జీవితం.. ఓ థ్రిల్లర్ సినిమా : సమంత 

జీవితంలో ఎప్పుడు ఎలాంటి ట్విస్టు వస్తుందో ఊహించలేం. జీవితానికి మించిన థ్రిల్లర్ సినిమా లేదు అంటోంది హీరోయిన్ సమంత. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు నేనున్న స్థాయిని అస్సలు ఊహించలేదు.  నా జీవితంలోకి ఇంతమంది గొప్ప వ్యక్తులు వస్తారనుకోలేదు. ప్రతి ఒక్కరి జీవితమూ ఇంతే.

భవిష్యత్తులో ఊహించని బహుమతులెన్నో ఉంటాయి. వాటిని అందుకోవడానికి మనం ఓ అర్హత సంపాదించాలి. ఎదురుదెబ్బలు, ఓటములు రాటుదేలేలా చేస్తాయి. అవీ ఈ పరంపరలో ఓ భాగమే. మనకు ఎదురుగా ఏదొచ్చినా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని సామ్ చెప్పుకొచ్చింది. ఈ యేడాది సామ్ రంగస్థలం, మజిలీ, ఓ బేబీ లాంటి సూపర్ హిట్స్ అందుకొంది. వీటిలో భర్త నాగ చైతన్యతో కలిసి నటించిన మజిలీ సామ్ కి ప్రత్యేక సినిమాగా నిలిచింది. ఈ సినిమా విజయాన్ని సామ్ తెగ ఎంజాయ్ చేసింది.