అమెజాన్ ప్రైమ్ లో ‘సాహో’.. చూసేయండీ !

ప్రభాస్ ‘సాహో’ సినిమాని చూడలేకపోయిన వారికి, మరోసారి చూడాలనుకొంటున్న వారికి గుడ్ న్యూస్. అమెజాన్ ప్రైమ్ లో ‘సాహో’ విడుదల కానుంది. ప్రభాస్ బర్త్ డే కానుకగా అక్టోబర్ 23న సాహో సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నట్టు సమాచారమ్. బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి వచ్చిన ప్యాన్ ఇండియా సినిమా ఇది.

ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించారు. దాదాపు రూ. 350కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన సాహో మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకొంది. ఐతే, టాక్ తో సంబంధం లేకుండా సాహో భారీ వసూళ్లనే సాధించింది. బాలీవుడ్ లో రూ. 150కోట్లకి పైగా వసూలు చేసింది. కొన్ని ఏరియాల్లో మాత్రం నష్టాలు తప్పలేదని తెలిసింది. మొత్తానికి సాహో ఆశించిన స్థాయిలో ఆడలేదు.