రెండో టెస్ట్ : భారత్ కు భారీ ఆధిక్యం


పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్‌ లో దక్షిణాఫ్రికా 275 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమ్ ఇండియాకు తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు 36/3 స్కోరుతో ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన క్వింటన్  డికాక్ 31తో కలిసి దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ 64 ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు.

వీరిద్దరినీ అశ్విన్ అవుట్ చేయడంతో సఫారీలు మరోసారి కష్టాల్లో పడ్డారు. కానీ, కేశవ్ మహారాజ్ (72; 128 బంతుల్లో 12 ఫోర్లు), ఫిలాండర్ (44*; 177 బంతుల్లో 6 ఫోర్లు) అద్భుతంగా పోరాడారు. వీరిద్దరూ కలిసి తొమ్మిదో వికెట్ కు 109 పరుగులు జోడించారు. దీంతో దక్షిణాఫ్రికా 275 పరుగులు చేయగలిగింది. ఇక భారత బౌలర్లలో అశ్విన్  (4/69) ఉమేశ్ యాదవ్ (3/37) రాణించారు.