అఫీషియల్ : ‘అల.. వైకుంఠపురంలో’ రిలీజ్ డేటు ఫిక్స్

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే  కథానాయిక. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలోనే చిత్ర బృందం వెల్లడించింది. తాజాగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. జనవరి 12, 2020న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో బన్నీ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

ఒక చేతిలో కోడి పుంజు, మరో చేతిలో కత్తి, తల గుడ్డ కట్టుకున్న బన్నీ మాస్‌ లుక్‌ అదిరిపోయింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. నివేదా పేతురాజు, టబు, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ‘సామజవరగమన’ సాంగ్ మంచి స్పందన దక్కింది. ఏకంగా 30మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొంది. ఈ యేడాది వచ్చిన బెస్ట్ సాంగ్ గా నిలిచింది.